రాయలసీమలో
సీబీఐ అరెస్టులు కలకలం సృష్టించాయి. జడ్జిలపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన
వైసీపీ నేతల అరెస్టులకు
సీబీఐ ప్రయత్నిస్తోంది.
శ్రీ సత్య సాయి
జిల్లా హిందూపురం మున్సిపల్ 21 వ వార్డు కౌన్సిలర్
మారుతి రెడ్డి కోసం
సిబిఐ అధికారుల బృందం హిందూపురంలో విస్తృతంగా గాలించింది. విచారణకు హాజరు కాకపోవడంతో 6 సభ్యులు గల
సిబిఐ బృందం హిందూపురం రెండో పట్టణ
పోలీస్ స్టేషన్ చేరుకుని మూడు గంటల పాటు సిఐ వెంకటేశ్వర్లుతో చర్చలు జరిపింది. ఆ తర్వాత
సీబీఐ అధికారులు
మారుతి రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
అయితే
వైసీపీ నేత, కౌన్సిలర్
మారుతి రెడ్డి అందుబాటులో లేరు. దీంతో ఆయన భార్యకు
సీబీఐ అధికారులు నోటీసులు అందించారు. తదుపరి విచారణకు విజయవాడలో
సిబిఐ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు అందించారు. దాదాపు గంటపాటు
వైసీపీ నేత ఇంట్లో
సీబీఐ అధికారులు విచారణ జరిపారు.