ఆ అధికారి అక్రమాలపై సీఎం జగన్ ఫుల్ ఫైర్‌?

Chakravarthi Kalyan
రవాణా శాఖలో జరిగిన అక్రమాలు సీఎం జగన్ వరకూ వెళ్లాయి. ఈ అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బదిలీ అయిన కమిషనర్ రాజాబాబు తీసుకున్న నిర్ణయాలపై  సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్..  రవాణా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.


రాజాబాబు జారీ చేసిన వివాదాస్పద 23 జీవోను  కూడా తక్షణం రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి చర్యలనూ సహించేది లేదని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గత రెండు నెలల్లో రాజాబాబు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం జగన్ ఆగ్రహంతో రవాణ శాఖ చర్యలు చేపట్టింది. కొత్త కమిషనర్ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పాత కమిషనర్ ఇచ్చిన జీవో రద్దు కావడంతో 23 మంది అధికారులు తమ పాత స్థానాల్లోనే కొనసాగుతారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: