కేఎల్ రాహుల్‌తో కలిపి రోహిత్ శర్మ ఓపెనింగ్?
జట్టులోని అటగాళ్లందరి పాత్రపై మేనేజ్ మెంట్ స్పష్టమైన అభిప్రాయంతో ఉందని వివరించాడు. ఆసియా కప్ లో కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన, స్ట్రైక్ రేట్ ను కొందరు ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుంటే కేఎల్ మ్యాచ్ విన్నర్ అని రోహిత్ తెలిపాడు. ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో భారత్ జట్టు..ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. తర్వాత దక్షిణాఫ్రికాతోనూ మరో మూడు మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొన్న తర్వాత.. ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్తుంది.