జగనన్నా.. ఏడో తారీఖు వచ్చినా.. పెన్షన్ అందలేదే?
ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిగా జీతాలు అందలేదనన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు.. పింఛన్లు అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకన్నా ఒక గంట ముందైన పింఛను దారులకు పించన్లు ఇవ్వాలని పలుమార్లు రాష్ట్రప్రభుత్వాన్ని కోరామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. నాలుగు లక్షల మంది పింఛనుదారులు జీవనం సాగించడానికి పింఛన్లు ఆధారమని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పాత డి.ఏ బకాయిలను వెంటనే ఇవ్వాలని కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏదేమైనా జీతాలు మరీ ఇంత ఆలస్యం కావడం మాత్రం సరికాదు కదా.