జగన్‌కు వార్నింగ్‌.. వర్కవుట్ అవుద్దా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాలు మరోసారి హెచ్చరిక చేస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామంటున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. కలిసి వచ్చే ఇతర ఉద్యోగ సంఘాలతో కార్యాచరణ చేపడతామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అంటున్నారు. పీఆర్సీ పెండింగ్ డిమాండ్లపై ఆర్ధిక శాఖ అధికారులతో భేటీ అయిన ఉద్యోగ సంఘం నేతలు గతంలో హామీల గురించి తేల్చాలని ఆయన  డిమాండ్ చేశారు.
గతంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని సూర్యనారాయణ  ఆక్షేపించారు. సీపీఎస్ పై సెప్టెంబరు 30 తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పారని దానిపై స్పష్టత ఇవ్వాలని సూర్యనారాయణ కోరారు. డీఏల చెల్లింపుకు జీవోలు ఇచ్చినా  ఇంత‌వ‌ర‌కూ అమ‌లు కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. డీఏ బ‌కాయిలు చెల్లించ‌కున్నా ఉద్యోగుల ఖాతాల నుంచి ఆదాయపు పన్ను ఎందుకు మినహాయించారని ఆర్ధిక శాఖ అధికారులను ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: