పులివెందుల హత్య.. చంద్రబాబు లేఖ..?
ఇప్పుడు ఇదే అంశంపై చంద్రబాబు ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. హత్య కేసు నిందితులు అందరినీ అరెస్టు చేయ్యాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ఈ 5గురి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు లేఖలో తెలిపారు. హత్యకు కారణం అయిన వారందరినీ అరెస్టు చెయ్యాల్సి ఉన్నా పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.