అర్జున్,
శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్
సినిమా ఒకే ఒక్కడు గుర్తుందా.. ఆ సినిమాలో జర్నలిస్ట్ అయిన అర్జున్.. అనుకోకుండా సీఎం అవుతారు. ఇప్పుడు గుజరాత్‌లోనూ అదే జరగబోతోందా.. అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే..
గుజరాత్ సీఎం అభ్యర్థిగా...టీవీ యాంకర్,
పార్టీ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గఢ్వీ పేరును ఆమ్ ఆద్మీ
పార్టీ ఖరారు చేసింది. సీఎం అభ్యర్థిత్వానికి
గుజరాత్ శాఖ అధ్యక్షుడు గోపాల ఇటాలియా, ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరాతియా పోటీపడ్డారు.
పార్టీ నిర్వహించిన సర్వేలో 73 శాతం మంది గఢ్వీ పేరు సూచించారు.
ఇక గఢ్వీ వివరాలు ఏంటంటే.. ఆయన
ద్వారక జిల్లా...పిపాలియా గ్రామానికి చెందిన వాడు.
బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.
గుజరాత్ లో ఓబీసీలు 48శాతం ఉన్నారు.
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం
గుజరాత్ లో పాగా వేసేందుకు అరవింద్
కేజ్రీవాల్ చక్కటి ఎత్తులు వేస్తునత్నారు. ప్రచారంలోనూ, అభ్యర్థుల ప్రకటనలో ఆప్ దూసుకుపోతోంది.