అద్భుతం సృష్టించిన గుంటూరు వైద్యులు?

Chakravarthi Kalyan
గుంటూరు వైద్యులు వైద్య రంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. తాజాగా రమేశ్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్ర్తచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సైటస్ ఇన్వర్ సస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న 31 సంవత్సరాల కిరణ్మయికు పసరతిత్తుకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ వ్యాధి ఉన్న వారికి సాధారణ మానవ శరీర నిర్మాణంగా కాకుండా దానికి విరుద్ధంగా గుండె కుడి వైపున... కాలేయం ఎడమ వైపున ఉంది. ఈ మహిళకు గుండె లోపల రంధ్రం ఉంది. కిరణ్మయి తీవ్రకడుపు నొప్పితో రమేష్ ఆస్పత్రికి వచ్చింది.

డాక్టర్లు స్కానింగ్ చేసి చూడగా ఈ వ్యాధిని ఉందని గుర్తించారు. కామెర్లు తగ్గించడానికి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ లోకేష్  ఆధ్వర్యంలో స్టెంట్ అమర్చారు. ఆ తరువాత డాక్టర్ రాజు ఆధ్వర్యంలో వైద్య బృందం కోత లేకుండా లాప్రోస్కోపిక్ పద్ధతిన రాళ్లను తొలగించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో రోగిని ఒక్క రోజులోనే డిశ్చార్జ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: