మళ్లీ జగన్కు చిక్కులు తెచ్చిన ధర్మాన?
వైసీపీ సర్కారు తీసుకువచ్చిన కొత్త సంస్కరణల వలనే.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు. దీని ద్వారా ప్రభుత్వం వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించినట్టయింది. రాష్ట్రంలో అభివృద్ధి జరగంలేదన్న మాటలో వాస్తవం లేదన్న ధర్మాన... సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగిందన్నారు. విశాఖపట్నమే ఏకైక రాజధాని అన్న మంత్రి ధర్మాన... కర్నూలు, అమరావతిలో ఆ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈవిధంగా ప్రస్తుతం పరిపాలనలు సాగుతున్నాయన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు... రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నమేనన్నారు.