
బంపర్ ఆఫర్: రూ. 35 లక్షలు ఇస్తే.. రూ.70 లక్షలు ఇస్తాం!
అసలేమైందంటే.. ఈ నెల 3న చంద్రగిరి సమీపంలో తెలంగాణ యాదాద్రి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకర్ రెడ్డి నుంచి కొందరు దుండగులు కళ్ళల్లో కారం చల్లి నగదు దోచుకెళ్ళారు. ఈ సంఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు దోపిడి తీరును గుర్తించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన కృష్ణమూర్తి, కర్ణాటకకు చెందిన మహిళతో కలిసి దోపిడికి పాల్పడినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.