చైనాతో ఆంధ్రా ఎగుమతులకు భలే చిక్కు ?
ఆక్వా రైతులకు స్ధిరమైన రేట్లను నిర్ణయిస్తామన్న మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు.. 100 కౌంటుకు 210 రూపాయలుగా నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా రంగంలో ప్రతిష్టంభనలకు కారణం విదేశీ మార్కెట్ లో ఒడిదుడుకులేనని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు తేల్చి చెప్పారు. రైతులు,ఆక్వా కంపెనీలు సమన్వయం కుదిరేలా రేటు నిర్ణయించామని.. క్రాప్ హాలిడే అనే మాటే లేదని.. పది రోజుల పాటు ఇవే రేట్లు ఉంటాయని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చామని మంత్రి సీదిరి అప్పల రాజు తెలిపారు.