జగన్‌ పాలనలో.. క్షోభకు గురవుతున్న రెడ్లు?

Chakravarthi Kalyan
జగన్ సర్కారుపై నారా లోకేశ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో రెడ్లంతా ఎంతో క్షోభకు గురవుతున్నారని నారా లోకేశ్ అంటున్నారు. 2019లో ఆ పార్టీని గెలిపించడానికి రెడ్లు ఎంతో కష్టపడ్డారని నారా లోకేశ్ గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు మాత్రం రెడ్లంతా ఆలోచనలో ఉన్నారని.. జగన్‌కు ఎందుకు గెలిపించుకున్నామా అని బాధపడుతున్నారని నారా లోకేశ్ అంటున్నారు.

 గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. తాడేపల్లిలో విచ్చలవిడిగా గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని నారా లోకేశ్ ఆరోపించారు. గాడితప్పిన రాష్ట్రాన్ని మనందరం కలిసి దారిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని లోకేశ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలో సార్ సార్ అనడం తప్ప ముఖ్యమంత్రి జగన్ ఏది సాధించలేదని నారా లోకేష్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: