తెలుగు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కృష్ణ కుటుంబానికి సీఎం జగన్ సంతాపం తెలియజేశారు. కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్ అని సీఎం జగన్ అన్నారు. కృష్ణే మన అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్ అంటూ సీఎం జగన్ స్మరించుకున్నారు. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న కృష్ణ మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటని సీఎం జగన్ నివాళులు అర్పించారు.
మహేష్ తో పాటు కృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని సీఎం వైయస్ జగన్ తన సంతాప సందేశంలో తెలిపారు. ఘట్టమనేని కుటుంబంతో వైయస్ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు.