అ అరాచకాలు చేసింది చంద్రబాబు శిష్యులేనా?
ఆక్వా సిండికేట్ వ్యవస్థల్లోని వారంతా చంద్రబాబు శిష్యులేనని.. వారంతా సిండికేట్ అయ్యి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా తాము వెనకడుగు వేసేది లేదని అంటున్నారు. ఈ నెల 21న నరసాపురానికి సిఎం వైయస్ జగన్ గారు వస్తున్నారని... అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా.. నరసాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారని చెబుతున్నారు. ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్ హార్బర్‌తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేస్తారని వివరిస్తున్నారు. అయితే సమస్య ఏదైనా చంద్రబాబే కారణం అనడం కూడా కరెక్టు కాదేమో.. వైసీపీ నేతలు ఆలోచించాలి.