రేపు ఆ జిల్లాకు సీఎం జగన్.. ఏం చేస్తారంటే?
నక్కావారి పేట వీవర్సు కాలనీలో ముఖ్యమంత్రి పాల్గొనున్న బహిరంగ సభా వేదికను, చినమామిడి లే అవుట్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. చినమామిడిపల్లి హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకూ రహదారులు, పట్టణమంతా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, పూల మొక్కలతో సుందరీకరణ చేయాలని అధికారులకు సూచించారు.