ఈడీ దూకుడు.. తెలంగాణ మంత్రుల వణుకుడు?
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లలో.. సంస్థల్లో ప్రధానంగా సోదాలు చేస్తున్నారు. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 వరకూ బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ఆఫీసుల్లోనూ.. నిన్న మంత్రి తలసాని సోదరుడిని కేసినో కేసులోనూ విచారించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈడీ దూకుడు తెలంగాణ మంత్రుల్లో గుబులు రేపుతున్నట్టుగా ఉంది.