భూమిని మనమే నాశనం చేస్తున్నామా?

Chakravarthi Kalyan
వాతావరణ మార్పులతో మానవాళికి సవాళ్లు పెరుగుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు అ ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి చర్చలు సాగిస్తున్నా ఫలితం ఉండటం లేదు. తాజాగా ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల విభాగం ఆధ్వర్యంలో ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌ పట్టణం వేదికగా కాప్‌-27 సదస్సు జరిగింది. 1995 నుంచి ఐరాస ఈ సదస్సులు ఏర్పాటు చేస్తోంది.

ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి  ప్రపంచ వేదికల్లో చేసే తీర్మానాలు జరుగుతున్నా.. వాటిని అమలు చేయడంలోనే అసలు చిక్కు వస్తోంది. కొన్ని దేశాల అభివృద్ధి కోసం భూగోళంపై విచ్చలవిడిగా విధ్వంసం సాగుతోంది. వనరుల వెలికితీత, దుర్వినియోగం కారణంగా మానవాళిని ప్రమాదంలో పడుతోంది. ఐరాస నివేదికల ప్రకారం- ఏటా ఒక కోటీ పదహారు వేల ఎకరాల విస్తీర్ణం మేర అడవులు ధ్వంసం అవుతున్నాయి. అంటే మన భూమిని మనమే నాశనం చేసుకుంటున్నామన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: