భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధాల్లో కొత్త మలుపు తిరిగింది. ఈ రెండు దేశాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆస్ట్రేలియా పార్లమెంటు ఆమోదించడం కొత్త ఊపు తెస్తోంది. ఈ ఆమోదంతో భారత్-ఆస్ట్రేలియాలు త్వరలో ఒప్పందాన్ని అమలు చేయబోతున్నాయి. ఇందుకు మార్గం సుగమం అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరుదేశాల మధ్య.. ఏఐ ఈసీటీఏ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా పార్లమెంట్ దానిని ఆమోదించినట్లు ఆ దేశ ప్రధాని ఆంథోని ఆల్బనీస్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య 27.5బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ గతంలో తెలిపారు.
ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా వివరించారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య వాణిజ్యం విలువ 45నుంచి 50బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. ఏఐ ఈసీటీఏ ఒప్పందం కూడా త్వరలో పట్టాలెక్కబోతోంది. అందుకే భారత స్టీల్ పరిశ్రమలు ఆస్ట్రేలియా విపణిలోని జీరో-సుంకం అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆస్ట్రేలియా కోరుతోంది.