చైనాకు చుక్కలు చూపిస్తున్న ఇండియా, అమెరికా?
గతేడాది ఈ విన్యాసాలను అమెరికాలోని అలాస్కాలో ఉన్న జాయింట్బేస్ ఎల్మాండర్ రిచర్డ్స్సన్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విన్యాసాల్లో శిక్షణ పొందిన కుక్కలతో ఉగ్రవాదులను ఎదుర్కొనే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. శత్రువుల డ్రోన్లను కూల్చడానికి గాలిపటాలను ఉపయోగించే తీరును ప్రదర్శిస్తున్నారు. అలాగే కిల్ హౌస్ విన్యాసాలతో పాటు రష్యా తయారు చేసిన MI-17V5 హెలికాప్టర్ తోనూ విన్యాసాలు చేస్తున్నారు. ఈ విన్యాసాల్లో భాగంగా ఇండియా, అమెరికా రకరకాల వ్యూహాలు, టెక్నాలజీలను ఇరు దేశాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాయి.