జగన్.. మడమ తిప్పేశావా..లోకేశ్ ఎద్దేవా?
ప్రతీ ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్ గతంలో హామీ ఇచ్చారని నారా లోకేశ్ గుర్తు చేశారు. హామీలతో నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ఏళ్ళు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ 150 వారాలైనా రద్దు చేయలేదని.. అలాగే అవుట్ సోర్సింగ్ వాళ్లకి ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ గాలికి ఎగిరిపోయిందని నారా లోకేశ్ మండిపడ్డారు.