ఏపీలో భూముల సర్వే: వారి ప్రాణాలు తీస్తోందా?
రికార్డుల్లో తప్పులు వస్తే వీఆర్వోలను బలి చేయటం తగదని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు అన్నారు. నిధులు, మ్యాప్ లు లేకుండా వంద రోజుల్లో రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యం విధించటం ఏమిటని భూపతి రాజు రవీంద్రరాజు ప్రశ్నించారు. రీసర్వే తోపాటు వ్యవసాయ సర్వే, వెబ్ ల్యాండ్, హౌస్ సైట్ల ఈకేవైసీ, ధృవపత్రాల జారీకి తనిఖీలు, రైస్ కార్డుల లాంటి పనులూ వీఆర్వోలు చేయాల్సి వస్తోందని.. త్వరలోనే దీనిపై మండల, డివిజన్, జిల్లా స్థాయిలో గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆందోళన కార్యాచరణ ప్రకటిస్తుందని భూపతి రాజు రవీంద్రరాజు తెలిపారు.