కర్ణాటకలో కేసీఆర్‌.. జెండా పాతేస్తారా?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ వేదికగా జాతీయ పార్టీ ఆవిర్భవించింది. టీఆర్ఎస్‌ కాస్తా బీఆర్‌ఎస్‌ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్పు చేసేందుకు అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపిన మరుసటి రోజే కేసీఆర్‌ జాతీయ పార్టీని ప్రారంభించారు. దేశ రాజధాని దిల్లీలో ఈనెల 14న భారత రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారభించనున్న కేసీఆర్‌.... తొలుత కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు.

అయితే.. కర్ణాటకలో కేసీఆర్ ప్రభావం ఎంత వరకూ ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే కర్ణాటక రైతులు.. తెలంగాణ రైతులకు అందుతున్న పథకాల గురించి చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాలైతే తెలంగాణలో కలుస్తామని కూడా అంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు. రెండేళ్లలో దేశంలోనిఅన్ని గ్రామాలకు 24గంటల కరెంటు ఇస్తామంటున్న కేసీఆర్‌... ఏడాదికి 25 లక్షల కుటుంబాలకు  దళితబంధు కూడా అందిస్తామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: