గుడ్ న్యూస్ : తండ్రి కాబోతున్న మెగా పవర్ స్టార్!

Purushottham Vinay
మెగా అభిమానులందరికీ శుభవార్త ని అందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వార్త కోసం మెగా అభిమానులే కాదు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ శుభవార్త ఏంటంటే చిరంజీవి ముద్దుల తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ఉపాసన వివాహం 2012 వ సంవత్సరంలో చాలా గ్రాండ్ గా జరిగింది.



దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించడం జరిగింది. దీంతో మెగా అభిమానులంతా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇంకా అలాగే ఆయన సతీమణి ఉపాసనకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం చిరంజీవి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: