సరిహద్దుల్లో ఘర్షణ: చైనా అడ్డగోలు వాదన?

Chakravarthi Kalyan
అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికల మధ్య ఘర్షణపై చైనా అడ్డగోలుగా మాట్లాడుతోంది. భారత సైనికులే అక్రమంగా చైనాలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారని చెబుతోంది. తమ సైన్యం హుందాగా వ్యవహరించిందని.. అందుకే ఘర్షణ పెద్దది కాలేదని చెపుతోంది. తవాంగ్‌ సెక్టార్‌లో ఈనెల 9న జరిగిన సైనిక ఘర్షణపై మొదట్లో చైనా స్పందించలేదు. సరిహద్దు విషయాల్లో రెండు దేశాలు దౌత్య, మిలిటరీ మార్గాల్లో చర్చలు జరుపుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్బిన్‌ తెలిపారు.
భారత సైనికులే అక్రమంగా చైనాలో చొరబడేందుకు యత్నించారని చైనా అంటోంది.  తమ సైన్యం చాలా హుందా వ్యవహరించిందని చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌లోని సీనియర్‌ కర్నల్‌ లాంగ్‌ షావోహువా తెలిపారు. తమ బలగాలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా భారత సైన్యం రహదారిని దిగ్భందించిందని అన్నారు. చైనాలోకి చొరబడేందుకు యత్నించిందని ఆరోపించారు. చైనా సైన్యం హుందాగా వ్యవహరించడంతో రెండు దేశాల సైనికులు  ఆ ప్రాంతం వీడి వెనక్కు వెళ్లిపోయాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: