ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భవానీలు!
భవానిల కోసం తాత్కాలిక షెడ్లు, కేశ ఖండన శాలలు ఏర్పాటు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు 5 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ కు అనుమతి ఇచ్చారు. 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందిస్తున్నారు. భవానీల కోసం 20లక్షల లడ్డూలు సిద్దం చేశారు. సీతమ్మవారి పాదాలు, భవాని ఘాట్, పున్నమి ఘాట్ ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.