ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా సినీ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ 2. ఈ సినిమా డిసెంబర్ 16 అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు రెడీగా ఉంది.ఈ సినిమా ఏకంగా 160 బాషల్లో విడుదల కాబోతుంది. ఇక వారం ముందు నుంచే భారీ బుకింగ్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేసిన అవతార్ సినిమాకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. మరికొన్ని గంటల్లో విడుదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని వెబ్ సైట్స్ లో ప్రత్యక్షమయ్యంది.
ఆన్‌లైన్‌లో అవతార్ 2 సినిమా పైరసీ ప్రింట్స్‌తో ఫ్రీ షోస్ నిర్వహిస్తున్నారు.థియేటర్లలో అవతార్ 2 సినిమా రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది.సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న మూవీ పైరసీ ప్రింట్ కొన్ని వేలసంఖ్యలో డౌన్‌లోడ్ అవుతున్న పైరసీ ప్రింట్.. ఇక ఎక్కువసార్లు పైరసీకి గురైన చిత్రంగా అవతార్1 సినిమా రికార్డ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు అవతార్ 2 సినిమా కూడా పైరసీ బారిన పడటంతో వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది.