పాపం.. రేవంత్ రెడ్డిని ఆడుకుంటున్నారుగా?
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికీ ఎక్కువ పదవులు ఇచ్చినట్లు అసంతృప్త సీనియర్లు ఆరోపించారు. అయితే.. ఇందుకు కౌంటర్ గ జంబో జాబితాలోని పార్టీల నుంచి వచ్చిన వివరాలతో కూడిన జాబితాను ఏఐసీసీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సామజిక వర్గాలవారీగా కూడా జాబితా సిద్ధం చేసిన ఏఐసీసీ... సాయంత్రం పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనుంది. అయితే.. ఈ సమావేశానికి హాజరు కాకూడదని సీనియర్లు నిర్ణయించుకున్నారు. మొత్తానికి సీనియర్లు రేవంత్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారుగా..!