కేసీఆర్ గుడ్‌న్యూస్: 28 నుంచి ఎకౌంట్లలో డబ్బులు?
మొత్తం 7600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేసీఆర్ ప్రభుత్వం జమ చేయనుంది. ఎలాంటి కోతలు లేకుండా రైతులందరికీ రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుబంధు నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుబంధు దేశానికే ఆదర్శమన్న.. దేశంలో నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తున్న మొట్టమొదటి పథకం రైతుబంధు అని నిరంజన్ రెడ్డి అన్నారు.