కరోనా మళ్లీ ముంచుకొస్తోందా.. కేంద్రం వార్నింగ్‌?

Chakravarthi Kalyan
చైనా, జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్‌లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పలు దేశాల్లో కొవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసుల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్ల గుర్తింపు కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. రోజువారీ పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్‌ ల్యాబ్‌కు పంపాలని కేంద్రం సూచించింది.
 

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించవచ్చన్న  కేంద్రం... ప్రస్తుతం దేశంలో వారానికి 1200 కొవిడ్‌ కేసులు వస్తున్నాయని తెలిపింది. అయితే.. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కొవిడ్‌ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా అంతా అప్రమత్తం కావాలని  కేంద్రం సూచించింది. కరోనా విజృంభణ దృష్ట్యా భారత్‌లోనూ అప్రమత్తత అవసరమంటూ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే చైనాలో కరోనా మరణ మృదంగం మొదలైంది. అక్కడ రోజూ వందల మరణాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: