ఎన్నికల ముందు మందుబాబులకు జగన్ షాక్ ఇస్తారా?
కరోనా వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి అన్ని పరిగణనలోకి తీసుకుని దీనిని పరిశీలించాల్సి ఉంటుందన్న కోలగట్ల.. ఎన్నికల ముందు దీనిపై నిర్ణయం ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. దశల వారీగా మద్య నిషేధం విధిస్తానని ఎన్నికల ముందు జగన్ చెప్పారు. కానీ.. అమలులో అది సాధ్యం కావడం లేదు. మరి ఈ ఎన్నికల ముందు గతంలో ఎన్టీఆర్ తరహాలో మొత్తానికే మద్యం ఎత్తేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.