కెసిఆర్ అమిత్ షా ను టార్గెట్ చేద్దాం అనుకుంటే, అమిత్ షా ను టార్గెట్ చేయడానికి అస్త్రాలు వదిలితే.. అవి తిరిగి వచ్చి కేసీఆర్కే తగులుతున్నాయి. ఫామ్ హౌస్ కేసు విషయంలో రోహిత్ రెడ్డి చెప్పిన వ్యక్తి నందకుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి రోహిత్ రెడ్డి కి స్నేహితుడేనని తేలింది. మరొక విషయం ఏమిటంటే సింహయాజి.. అనే వ్యక్తి కూడా రోహిత్ రెడ్డి గురువేనన్న విషయం కూడా తేలింది. రోహిత్ రెడ్డికి వాళ్ళ తమ్ముడికి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, అది కూడా డ్రగ్స్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఉన్నాయని కూడా తేలింది.
దీనికి నందకుమార్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి ఈడీకి పర్మిషన్ లభించడం.. కేసిఆర్ కు ఒక అనుకోని ఎదురు దెబ్బ అయితే, కవితకి సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్లో నమోదు అవ్వడం కూడా.. మరొక అనుకోని ఎదురుదెబ్బ. ఫామ్ హౌస్ కేసు కూడా సిబిఐ విచారణకు వెళుతుండడం కూడా కేసీఆర్ కు తిరుగులేని ఎదురు దెబ్బలా తగిలింది. ఇలా కేసీఆర్ వదిలిన బాణాలు తిరిగి వచ్చి ఆయనకే గట్టిగా తగులుతున్నాయి.