ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ ఝలక్‌.. అది మస్ట్‌?

Chakravarthi Kalyan
ఏపీలో ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర సచివాలయంని విభాగాలతో పాటు విభాగాధి పతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు , జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులకు సంబంధించిన వివరాలను అప్ లోడ్ చేయాలని జగన్ సర్కార్‌ స్పష్టం చేసింది. ఉద్యోగులకు జారీ చేసిన సీఎఫ్ఐఎంస్ ఐడీ సహా మొబైల్ నెంబర్లను మానవ వనరుల నిర్వహణా వెబ్ సైట్ హెర్బ్ డాట్ ఎపీసీఎఫ్ఎస్ఎస్ లో నమోదు చేయాల్సిందిగా జగన్ సర్కార్‌ సూచించింది.

ఉద్యోగుల సీఎఫ్ఎఎఎస్ ఐడీ తో పాటు మోబైల్ నెంబర్లను కూడా అప్ లోడ్ చేయాలని జగన్ సర్కార్‌ స్పష్టం చేసింది.  రాష్ట్రంలోని అందరు డ్రాయింగ్ అండ్ డిస్బర్సుమెంట్ అధికారులు, సచివాలయ అధికారులకు జగన్ సర్కార్‌ సూచనలు జారీచేసింది. రాష్ట్ర సచివాలయం, విభాగ అధిపతి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు,  గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ హాజరు తప్పని సరి అని జగన్ సర్కార్‌ పేర్కోంది. 2023 జనవరి 1 తేదీ నుంచి సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలకు, అలాగే మిగతా కార్యాలయాల సిబ్బందికి జనవరి 16 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానం తప్పనిసరి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: