జగన్‌ పించన్ల సొమ్ములో నకిలీ నోట్ల గోల?

Chakravarthi Kalyan
జగన్ సర్కారు జనవరి 1 నుంచి ఫించన్ల పంపణీ ప్రారంభించింది. పించన్‌ సొమ్ము పెంచి మరీ అందిస్తోంది. ప్రస్తుతం రూ.2750 రూపాయలు వృద్దాప్య పించన్ ఇస్తున్నారు. ప్రస్తుతం 64.06 లక్షలకు చేరిన పింఛన్ల సంఖ్య చేరింది. ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో ఏపీలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరినట్టు ప్రభుత్వం చెబుతోంది.

జనవరి 1వ తేదీ ఆదివారం సెలవు రోజు అయినా తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు అంద‌ించారు. ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల ఖాతాల్లో రూ.1,765 కోట్ల నిధులు జమ చేసింది. అయితే.. ఇలా ఇస్తున్న నోట్లలో కొన్ని నకిలీవి రావడం కలకలం రేపుతోంది. రెండు, మూడు జిల్లాల్లో ఈ పరిస్థితి ఎదురైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: