నెలలో రూ. లక్షా 40 వేల కోట్లు.. మోదీ కలెక్షన్‌ సూపర్‌?

Chakravarthi Kalyan
జీఎస్టీ వసూళ్లు దేశంలో రికార్డు స్థాయిలో వసూలవుతున్నాయి. వరుసగా పదోసారి జీఎస్టీ  వసూళ్లు లక్షా 40వేల కోట్లు దాటాయి. 2022 డిసెంబర్‌ నెలలో GST ద్వారా లక్షా 49వేల 5వందల ఏడు కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసింది. 2021 డిసెంబర్‌తో పోలిస్తే...జీఎస్టీ పన్ను వసూళ్లలో 15 శాతం వృద్ధి నమోదైంది.

సెంట్రల్ జీఎస్టీ ద్వారా 26వేల 7వందల 11 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే స్టేట్ జీఎస్టీ వసూళ్ల ద్వారా  33వేల 3వందల 57 కోట్లు వచ్చాయి. ఇవి కాకుండా ఐ జీఎస్టీ ద్వారా 78వేల 4వందల 34 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021 డిసెంబర్‌తో పోలిస్తే జీఎస్టీ  గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతి ఆదాయం 8శాతం, దిగుమతి సేవల రాబడి 18శాతం పెరిగినట్లు కేంద్రం లెక్కలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

GST

సంబంధిత వార్తలు: