ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బాపట్లలోని ఐడీబీఐ బ్యాంకును మోసం చేసిన కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసు విషయంలో ఈడీ ఏకంగా రూ.20.31 కోట్ల విలువైన 47 ఆస్తులు అటాచ్ చేయడం కూడా సంచలనంగా మారింది. ఈ కేసులో సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్‌రావు, మల్లికార్జున్, ప్రసాద్‌రావుకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసు విషయంలో చేపల పెంపకం కోసం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు తీసుకున్న నిందితులు.. ఆ తర్వాత మోసం చేశారు.
247మంది బినామీల పేర్ల మీద రుణాలు తీసుకున్న నలుగురు నిందితులు.. ఆ రుణాలు చెల్లించలేదు. దీంతో ఐడీబీఐ ప్రతినిధులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ సహకారంతో మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఆ సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో?