కేసీఆర్‌ రైతు బంధు నిధులు.. మీ ఖాతాలో పడ్డాయా?

Chakravarthi Kalyan
రైతుబంధు పథకం కింద ఆరో రోజు 262.60కోట్ల నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. ఒక లక్ష 49,970  మంది రైతుల ఖాతాలలో 5 లక్షల 25 వేల 200.21 ఎకరాలకు నిధులు విడుదల చేసిన జమ చేసినట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు  51 లక్షల 50,958 మంది రైతులకు 3767.35 కోట్లు నిధులు రైతుబంధు పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసినట్లు  మంత్రి నిరంజన్‌ రెడ్డి  స్పష్టం చేశారు.
 కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం చేయకున్నా కరంటు, సాగునీరు, రైతుబంధు, రైతుభీమా పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. దేశమంతా ఈ పథకాలు అమలైతే దేశ వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని నిరంజన్ రెడ్డి వివరించారు. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలని...కేసీఆర్ ఆలోచనలు దేశానికి అత్యవసరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని పాలకులపై సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలపై సమాజంలో చర్చ మొదలైందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: