మేం దావోస్ వెళ్లం.. వాళ్లనే రప్పిస్తాం.. ఏపీ మంత్రి ధీమా?
దేశ విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెబ్ సైట్ ను ప్రారంభించామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. సమయం, వనరులు వృధా చేయకుండా 12 ముఖ్యమైన రంగాల పై దృష్టి పెట్టామని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెష్ట్ మెంట్ సమ్మిట్ లోగో ను ప్రాచుర్యం చేసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నమంత్రి అమర్నాథ్.. ఇందుకోసం ఈవెంట్ మేనేజ్మెంట్ కమిటీ తో చర్చించి కార్యక్రమాలు రూపొందించనున్నట్లు చెప్పారు.