ఆ పని చేస్తే.. మళ్లీ జగన్ దే అధికారం..?
వైయస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరిని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కలవాలని బాలినేని శ్రీనివాస రెడ్డి సూచించారు. సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించిన బాలినేని శ్రీనివాస రెడ్డి.. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న సమస్యలు, మనస్పర్థలు ఉన్నా మనసులో పెట్టుకోకుండా పార్టీ విజయానికి అంతా సహకరించాలని శ్రీనివాస రెడ్డి కోరారు.