జాతీయ నేత శరద్‌ యాదవ్‌ హఠాన్మరణం?

Chakravarthi Kalyan
జేడీయూ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ హఠాన్మరణం చెందారు. ఆయన ఏడు సార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన సీనియర్ నేత. మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు కూడా. సొంత ఇంట్లో ఆయన కుప్పకూలిపోగా ఆయన్ను గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన్ను బతికించే ప్రయత్నం చేసినా సాధ్య పడలేదు. శరద్ యాదవ్ దేశంలో రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శరద్ యాదవ్ పోరాడారు. శరద్ యాదవ్ అత్యుత్తమ పార్లమెంటేరియన్ అంటూ టీడీపీ నివాళు అర్పించింది.

గొప్ప రైతు నాయకుడిని దేశం కోల్పోయిందన్న మాజీ ఎంపి కంభంపాటి రామమోహన్ రావు సంతాపం తెలిపారు. శరద్ యాదవ్ మృతితో దేశం గొప్ప రైతు నాయకుడిని కోల్పోయిందని.. 7సార్లు లోక్ సభకు, 3సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని మాజీ ఎంపి కంభంపాటి రామమోహన్ రావు స్మరించుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా శరద్ యాదవ్ ఉన్నారని కంభంపాటి గుర్తు చేసుకున్నారు. కేంద్రమంత్రిగా, ఎంపిగా, రైతు నాయకుడిగా శరద్  యాదవ్ సేవలు కొనియాడదగినవని.. శరద్ యాదవ్ మృతితో దేశం గొప్ప పార్లమెంటేరియన్ ను కోల్పోయిందని.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని కంభంపాటి రామమోహన్ రావు సంతాపం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: