అమ్మాయిలతో వలవేసి.. లక్షలు కాజేసి..?

Chakravarthi Kalyan
మహిళలతో హాని ట్రాప్ చేయించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితుల్లో పది మంది పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో మహిళ పరారీలో ఉంది. ప్రధాన నిందితుడు వికార్ మెహది గతంలో ముషీరాబాద్ లో హోంగార్డుగా పనిచేశాడు. నిందితులపై హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీరు బడా వ్యాపారవేత్తల నంబర్లు సేకరించి హోటళ్లకు వచ్చేలా మహిళలు ప్రేరేపిస్తారు.


పారిశ్రామిక వేత్తలు హోటళ్లకు వచ్చిన తర్వాత ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడతారు. వారు మహిళలతో ఉండగా గదిలోకి ప్రవేశించి డమ్మీ తుపాకులతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు వికార్ మెహదీ హోంగార్డుగా డిస్మిస్‌ అయిన తర్వాత ఈ దందాలకు పాల్పడుతున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు 4బృందాలను ఏర్పాటు చేసి నిందితులను  పట్టుకున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు 8.5లక్షల వరకు బాధితుల నుంచి దోచుకుంది. వీరిపై విచారణ జరిపి పీడీ యాక్టు నమోదు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: