ఇవాళ హైదరాబాద్ లో శ్రీ సర్వ సౌభాగ్య దేవీ త్రయ గీతాజ్ఞాన యజ్ఞం జరగనుంది. లోక కల్యాణార్ధం జనవరి 18, 19, 20 తేదీల్లో కర్మన్ ఘాట్ లోని శ్రీ లక్ష్మి కన్వెన్షన్ లో మూడు రోజుల పాటు... నిర్వహించ తలపెట్టిన 1896వ శ్రీ సర్వ సౌభాగ్య దేవీ త్రయ గీతాజ్ఞాన యజ్ఞ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలని శ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ విజ్ఞప్తి చేశారు. మానవాళి సుఖశాంతి సౌభాగ్యము, ఆయురారోగ్య ఐశ్వర్యములను, లోకోద్ధరణను కాంక్షించి... ఈ యజ్ఞ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ మాజీ సలహాదారు సముద్రాల వేణుగోపాలచారి హాజరవుతున్నారు. యజ్ఞయాగాది క్రతువులు, జప, తపములు, ప్రవచనములు, భజనలు మనలో ఆధ్యాత్మికతను పెంపోందిస్తాయని ఆయన తెలిపారు.