తెలుగుదేశం
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ మంగళగిరిలో ఛాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరిలోని ఓ హోటల్ లో ఐటీ నిపుణులతో చర్చించారు. ఐటీ ఉద్యోగాలు గతంలో లాగా ఉన్నాయా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. అక్కడ
లోకేష్ సరదాగా సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారు. వీరసింహారెడ్డి ఎలా ఉందని నారా లోకేశ్ అడిగారు. తాను
సినిమా చూశానన్నారు నారా లోకేశ్ . ఇక
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఎలా ఉందని కూడా ప్రశ్నించారు. అదీ బాగుందని యువకులు చెప్పారు. దీంతో తాను త్వరలోనే వాల్తేరు వీరయ్య
సినిమా చూస్తానని నారా లోకేశ్ అన్నారు.
రాష్ట్రంలో చదువుకున్న యువతకు సరైన ఉపాధి లభిస్తుందా అని నారా లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. రాజధానిని అభివృద్ధి చేయకపోవడం వల్ల మంగళగిరికి జరిగిన అన్యాయాన్ని నారా లోకేశ్ యువకుల దృష్టికి తీసుకెళ్లారు.