కేసీఆర్.. ఆ సంస్థలపై విశ్వాసం లేకపోతే ఎలా?
ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ ను ఏర్పాటు చేయడం, దేశ వ్యాప్తంగా న్యాయమూర్తులకు వీడియోలు పంపడం, లేఖలు రాయడం వివాదస్పదంగా మారాయని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ దర్యాప్తు సంస్థలైతేనే నిష్పక్షపాతంగా చేస్తాయని...కేంద్ర దర్యాప్తు సంస్థలైతే చేయవన్నఅభిప్రాయంతో ఉంటే సామాన్య ప్రజలకు దిక్కెవ్వరని జి.నిరంజన్ ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసు, నిఘా వ్యవస్థ, అవినీతి నిరోధక శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయబద్దంగా పని చేస్తామన్ననమ్మకం ఏమిటని జి.నిరంజన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుని దర్యాప్తు సంస్థల ప్రతిష్టను, విశ్వసనీయతను పరిరక్షించాలని జి.నిరంజన్ డిమాండ్ చేశారు.