అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలు, షేర్ల మోసపూరిత చర్యల ఆరోపణలపై సెబీ సంస్థ విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇప్పటికే రిజర్వుబ్యాంకు, సెబీలను కోరారు. ఆయన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, సెబీ ఛైర్పర్శన్ మదాబి పురి బుచ్‌లకు లేఖలు రాశారు. అదానీ గ్రూపు అధిక రుణం వ్యవహారంలో... ప్రస్తుతం, భవిష్యత్‌లోనూ భారత బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని..జైరాం రమేష్ శక్తికాంత్‌దాస్‌ను కోరారు.
ఆ లేఖను జైరాం రమేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అదానీ గ్రూపు తన...విదేశీ డమ్మీ సంస్థలతో తమ సంస్థల షేర్లకు అధిక విలువ వచ్చేలా చేసి ఉంటే ఇటీవల జరిగిన ఆ గూపు షేర్ల పతనం బ్యాంకింగ్ వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని జైరాం రమేష్ చెప్పారు. మరి ఈ అదానీ అంశంపై సెబీ దర్యాప్తు సజావుగా సాగుతుందా.. గుట్టు విప్పుతుందా?