విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ అంటున్నారు. పదవీ విరమణ సహాఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటీవ్‌లు, పీఆర్‌సీ, జీపీఎఫ్ వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు,ఆర్టిజన్లతో చర్చలు జరపాలని బండి సంజయ్ అంటున్నారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారని... దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గర్హనీయమని బండి సంజయ్ అన్నారు.
1999 నుండి 2004 మధ్య కాలంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌లు న్యాయబద్ధమైనవేనని బండి సంజయ్ తెలిపారు. వీరి న్యాయమైన కోరికలు పరిష్కరించని పక్షంలో ఉద్యోగులు ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగలేఖలో తెలిపారు.