మందుల ధరలు పెంచిన మోదీ సర్కార్‌?

frame మందుల ధరలు పెంచిన మోదీ సర్కార్‌?

Chakravarthi Kalyan
ఔషధ ధరలను కేంద్రం 12 శాతం పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి హరీశ్ రావు తప్పబట్టారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా మందుల ధరలు పెంచాలన్న కేంద్రం నిర్ణయం పేదలు, మధ్యతరగతి వారికి భారం అవుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే కేంద్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుందని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.  బీజేపీ చెబుతున్న అమృత్ కాల్‌ ఇదేనా అని ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు..  ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్ అని మండిపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More