15 రోజుల్లో.. గౌడ కులస్తులు గర్వపడేలా?

Chakravarthi Kalyan
హైదరాబాద్ నగరంలో రాబోవు 15 రోజుల్లో నీరా సెంటర్లతో పాటు... గౌడ భవనాన్ని ప్రారంభిస్తామని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. రాజకీయంగా సామాజికంగా గౌడ్ లు ఎదగాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహనీయుల జయంతులు మాత్రమే నిర్వహించేవారమని... కానీ మొట్టమొదటిసారిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి నిర్వహిస్తున్నామని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించారని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వైన్స్ షాపులలో గౌడులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు కూడా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: