
కేసీఆర్.. మాట తప్పొద్దంటున్న బండి సంజయ్?
జూనియర్ పంచాయితీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తే భయపడవద్దని మీ తరపున ఉద్యమిస్తామని.. ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్దమని...మిమ్ముల్ని బెదిరిస్తే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని బండి సంజయ్ తెలిపారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమైనదేనని వారికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు. తక్షణమే జూనియర్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.