
బీఎస్సీ సభ సక్సస్.. ఆ డబ్బులు ఎక్కడివి?
సరూర్‌నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాయావతి బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదని గువ్వల బాలరాజు ఆక్షేపించారు. మాయావతి తీరు చూసి కాన్షీరాం ఆత్మ కూడా క్షోభిస్తుందని.. దళితులకు ఆమె ద్రోహం చేస్తున్నారని గువ్వల బాలరాజు మండిపడ్డారు. బీఎస్పీ రాష్ట్ర నేత ప్రవీణ్‌కుమార్ పై కేసీఆర్ కొండంత నమ్మకముంచి గురుకులాల సోసైటీ కార్యదర్శిగా ఆరేళ్లు అవకాశం కల్పించారని.. ఆయన పదవీని దుర్వినియోగం చేసి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు.