
ఏంటి జగన్.. ఏపీ ర్యాంక్ అంతగా దిగజారిందా?
రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వస్తే ఏంటి రాకపోతే ఏంటని జగన్ ఆలోచిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. భారతదేశంలోనే అత్యంత సంపన్న సీఎం జగన్ ఆలోచనల్లా ఆయన సంపద, ఆస్తుల మీదే. యువత భవిత, ఉద్యోగాలు ఆయనకు పట్టవని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అమలు చేసే సంక్షేమమే ప్రజల సమస్యలకు పరిష్కారమన్నారు. గత నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మహానాడులో చర్చిస్తామన్నారు.